హైదరాబాద్: 28°C
వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్న సీఎం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈనెల 12 లేదా 14 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో వరంగల్, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో నూతన కలెక్టరేట్ భవనాలను ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే ములుగు జిల్లాలోని రామచంద్రాపురం గ్రామంలోని రైతులకు భూ పట్టాలను పంపిణీ చేస్తారని తెలుస్తోంది.