హైదరాబాద్: 28°C
వార్తలు

గ్రామీణ వైద్య విజ్ఞాన సదస్సు

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని స్కౌట్ భవన్లో గ్రామీణ వైద్య విజ్ఞాన సదస్సు ఘనంగా నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల పాత్ర కీలకమని ప్రముఖ వైద్యులు డాక్టర్ కె. స్వామి, డాక్టర్ కళ్యాణి పేర్కొన్నారు. మారుతున్న వైద్య విధానాలపై నిరంతరం అవగాహన పెంచుకుంటూ, రోగులకు ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాలు కాపాడాలని సూచించారు.