హైదరాబాద్: 28°C
వార్తలు

అంచుల్లో పొంచి ఉన్న ముప్పు

KRNL: కౌతాళం(M) ఉప్పరహాల్- కుంటనహాల్ గ్రామాల మధ్య రహదారిలో కల్వర్టు వద్ద పైపు పగిలిపోయి రహదారి కోతకు గురైంది. దీంతో సుమారు 12 నుంచి 16 అడుగులు ఉండాల్సిన రహదారి కోతలతో 5 అడుగుల వెడల్పు మాత్రమే ఉంది. ఎవరైనా పొరపాటున వేగంగా వచ్చినా.., కొత్తవారు గమనించుకోకుంటే ఇక్కడ ప్రమాదానికి గురికావాల్సిందే. ప్రమాదాలు జరగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.