హైదరాబాద్: 28°C
వార్తలు

14 ఏళ్ల తర్వాత ఆ కుటుంబంలో సంతోషం

HYD: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి IVF కేంద్రంలో 4వ ఐవీఎఫ్ కాన్పు విజయవంతమైంది. నాగర్ కర్నూలు చెందిన రైతు దంపతులు గవ్వల సతీశ్, నవీన 14 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఉచిత ఐవీఎఫ్ చికిత్సతో సంతానం కలిగింది. అక్టోబర్ 2025లో చేపట్టిన ఐవీఎఫ్ ప్రక్రియ సక్సెస్ కావడంతో నవీన గర్భం దాల్చింది. 3 కిలోల బరువున్న ఆరోగ్య కరమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది.