హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రతిపక్ష నేతగా రితబ్రత.. హైకోర్టుకు టీఎంసీ!

పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా నియమిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. స్పీకర్ నిర్ణయాన్ని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ హైకోర్టులో సవాల్ చేయనున్నారు. అంతర్గత విభేదాలతో టీఎంసీ రెండు వర్గాలుగా చీలిపోయింది. రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని 58 మందికి పైగా తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం తామే నిజమైన తృణమూల్ వర్గం అని ప్రకటించుకుంది.