హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్ చివరి కొనను సందర్శించా: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అండమాన్ దీవులను సందర్శించారు. అక్కడి ప్రకృతి సోయగాలు తనను కట్టిపడేశాయని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. 'నేను భారతదేశపు దక్షిణపు చివరి కొనను సందర్శించాను. భూమిపైనే అత్యంత జీవకళతో నిండిన పగడపు దిబ్బలలోకి మునిగాను. భారత ప్రభుత్వం ఈ ద్వీపాలలో స్థిరపరిచిన వలసదారుల్లో చాలామంది మాజీ సైనికులు ఉన్నారు. వీరికి సరైన పరిహారం అందడం లేదు' అని ట్వీట్ చేశారు.