హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రంపై ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఫైర్

కేంద్రంపై ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. గతంలో తెలంగాణలో బ్యాన్ చేసిన కోఎంప్ట్ (గ్లోబరీనా) కంపెనీకే కేంద్రం CBSC 12వ తరగతి ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానాన్ని కాంట్రాక్ట్ ఇచ్చిందని ధ్వజమెత్తారు. ఆ కంపెనీ TGలో సృష్టించిన సమస్యల వల్ల 20మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. అలాంటి కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడం వెనుక ఏదో కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు.