పలాస-కాశీబుగ్గ పుర పరిధిలో 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి, గర్భవతిని చేసిన అభి అనే వ్యక్తిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తల్లితో పరిచయాన్ని ఆసరాగా చేసుకుని, గత మూడు నెలలుగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలింది. గర్భం దాల్చిన విషయం బయటపడటంతో బాలికను శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించగా, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ జీవీ రమణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బాలికపై లైంగిక దాడి


