హైదరాబాద్: 28°C
వార్తలు

ఏనుగుల సంచారం జాగ్రత్తా.!

పార్వతీపురం మండలంలోని జమదాల, పొట్టి గదబవలస మధ్య ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం ఈ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమీప గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఉదయం, రాత్రి పొలాలకు వెళ్లే రైతులు ఏనుగుల సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని, కవ్వింపు చర్యలు చేపట్టకూడదని హెచ్చరించారు