హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'కన్నుల పండుగగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవం'

ADB: జైనథ్ మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తులను డప్పుల చప్పుళ్ల మధ్య పురవీధుల గుండా వైభవంగా ఊరేగించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు.