హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పీఎం రహత్' ద్వారా రూ.1.5 లక్షల ఉచిత వైద్యం: SP

ADB: రోడ్డు ప్రమాద బాధితులకు 'పీఎం రహత్' పథకం ద్వారా గరిష్ఠంగా 7 రోజుల పాటు రూ.1.5 లక్షల వరకు నగదు రహిత వైద్యం అందుతుందని SP అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లాలోని రిమ్స్, బోథ్, ఉట్నూర్ ఆసుపత్రులతో పాటు 4 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ సేవలు ఉన్నాయన్నారు. 'గోల్డెన్ అవర్'లో చికిత్స అందించి ప్రాణాలు కాపాడాలని, అత్యవసర సహాయానికి 112కు కాల్ చేయాలని సూచించారు.