హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్లూరు సెల్ టవర్ వద్ద భద్రత కరువు

ASF: పెంచికల్‌పేట్ మండలం ఎల్లూరు గ్రామంలో రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన సెల్ టవర్ చుట్టూ ఫెన్సింగ్, హెచ్చరిక బోర్డులు లేక ప్రమాదకరంగా మారింది. వైర్లు, పరికరాలు బయటే ఉండగా సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ కూడా ఉంది. ఈ దారిలో పిల్లలు, పాదచారులు, పశువులు తిరుగుతుంటారని, అధికారులకు చెప్పినా స్పందన లేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.