హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుత్తి కోయలకు కాళోజి వాకర్స్ సాయం

MLG : తాడ్వాయి మండలం ఊరట్టం శివారులోని భాసిగూడెంలో నివసిస్తున్న 27 గుత్తికోయ కుటుంబాలకు కాళోజి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఆదివారం మరో 11 కుటుంబాలకు చీరలు, దోవతులు అందజేశారు. చలికాలంలో నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు నామిరెడ్డి వెంకటరెడ్డితో పాటు సభ్యులు ఉన్నారు.