హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారు ఢీకొట్టి మహిళ స్పాట్‌ డెడ్

కొత్తగూడెం పట్టణంలోని ఎంజీ రోడ్డుపై ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బిగ్ బజార్ ఎదుట వేగంగా వచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ఓ మహిళ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని అనిశెట్టిపల్లి మండలానికి చెందిన సంధ్యారాణి (25)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారా లేదా అనేది తెలియరాలేదు.