హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక

SDPT: మర్కూక్ మండలం దామరకుంట ZPHS విద్యార్థినులు పులిపాటి తేజస్వి, సాయోజి కీర్తన రూపొందించిన సౌరశక్తి ఆధారిత రహదారి ప్రమాదాల నివారణ ప్రాజెక్టు రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైంది. హెయిర్‌పిన్ మలుపుల వద్ద స్మార్ట్ రోలర్లతో ప్రమాద తీవ్రతను తగ్గించేలా రూపొందించిన ఈ నమూనా జిల్లా స్థాయి ప్రదర్శనలో ప్రశంసలు అందుకుంది. విద్యార్థినులను ఉపాధ్యాయులు అభినందించారు.