నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్‌లో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భవనంలోని మూడో అంతస్తుపైకి చేరుకొని బలవన్మరణానికి ప్రయత్నించగా గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆమెను కాపాడారు. అప్పుల బాధ తాళలేక ఈ అఘాయిత్యానికి ప్రయత్నించినట్లు సమాచారం. బాధితురాలిని నిర్మల్ మండలం ఎల్లపల్లికి చెందిన మహిళగా గుర్తించారు.
తెలంగాణ
నిర్మల్‌లో మహిళ హత్యాయత్నం


