కోనసీమ: కే.గంగవరం మండలం పాణింగపల్లి 4వ వార్డు ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. హైదరాబాద్లో నివసిస్తున్న ఆరుగురు ఓటర్లను ప్రత్యేక వాహనంలో గ్రామానికి తీసుకొచ్చినట్లు సమాచారం. ఇందుకోసం ట్రావెల్ వాహనానికి రూ.30 వేలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో ఓటరుకు రూ.4 వేలు ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. మొత్తంగా ఒక్కో ఓటరుపై రూ.9 వేల వరకు ఖర్చయినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్
ఒక్కో ఓటుకు రూ.9 వేల ఖర్చు.. ఎక్కడంటే?


