హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెదపళ్లలో సర్పంచ్‌గా జాస్తి భాస్కరరావు విజయం

కోనసీమ: ఆలమూరు మండలం పెదపళ్ల గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి జాస్తి భాస్కరరావు 794 ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. గ్రామ ప్రజలు ఆయనకు భారీ మద్దతు పలకడంతో ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు. ఇక గ్రామంలోని మొత్తం 12 వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించి, అన్ని స్థానాలను కైవసం చేసుకున్నారు.