PLD: మాజీ పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు మృతి పట్ల మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో పారిశ్రామికవేత్తగా, రాజకీయ నాయకుడిగా ఆయన విశేష గుర్తింపు పొందారని పేర్కొన్నారు. రాయపాటి కుటుంబం తమ కుటుంబానికి ఎంతో ఆప్తులని, ఆయన ఇక లేరనే వార్త బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్
రాయపాటి మృతికి మాజీ మంత్రి కాసు సంతాపం


