హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన వ్యవసాయ పాలకవర్గాన్ని సన్మానించిన ఎమ్మెల్యే

KNR: రైతు సంక్షేమమే లక్ష్యంగా నూతన వ్యవసాయ పాలనవర్గం సభ్యులు పనిచేయాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. గంగాధర ప్రజా కార్యాలయంలో ఆదివారం గంగాధర, మల్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని శాలువాలతో సన్మానించి అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్ పరిధిలో రైతులు ఇబ్బంది పడకుండా పాలకవర్గం సభ్యులు పనిచేయాలని ఆదేశించారు.