హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాంధీనగర్ పంచాయతీలో టీడీపీ బోణీ

బాపట్ల జిల్లా చీరాల మండలం గాంధీనగర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బోణీ కొట్టింది. పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన చారుగుల్ల ప్రసాద్ 142 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల అధికారులు ఫలితాన్ని ప్రకటించడంతో గ్రామస్థులు, కూటమి నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తనను గెలిపించిన ప్రజలకు ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.