హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక

VSP: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు పునర్వ్యవస్థీకరించిన 10 జోన్లలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, పట్టణ ప్రణాళిక తదితర సమస్యలపై ప్రజలు తమ అర్జీలు సమర్పించి పరిష్కారం కోరవచ్చని వెల్లడించారు.