హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో తొలి సర్పంచ్ ఫలితం ఇదే

అనకాపల్లి: కోటవురట్ల మండలం చౌడువాడ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన సకిరెడ్డి వరలక్ష్మి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ మద్దతుతో పోటీ చేసిన సేనాపతి శ్రావణిపై 634 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మండలంలోని ఇతర పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సాయంత్రం 7 గంటల్లోపు అన్ని ఫలితాలు వెలువడనున్నాయి.