BPT: వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని బొచ్చులవారిపాలెంలో పంచాయతీ ఎన్నికల వేళ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. విషయం తెలుసుకున్న చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, అధికారులను అడిగి ఘర్షణకు గల కారణాలను ఆరా తీశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
అధికారులను ఆరా తీసిన ఎమ్మెల్యే కొండయ్య!


