హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మద్యపానం

అన్నమయ్య జిల్లా రాయచోటిలోని క్రిటికల్ కేర్ ఆసుపత్రి ఆవరణంలో పట్టపగలే కొందరు మద్యం సేవించినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. దాదాపు 30 నిమిషాల పాటు ఈ తతంగం సాగినా ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రత, భద్రతపై ప్రశ్నలు లేవనెత్తారు.