హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడియం బస్టాండ్‌లో మూతపడిన మరుగుదొడ్లు

E.G: కడియం మండల కేంద్రంలోని RTC బస్టాప్‌లో మరుగుదొడ్లు ఏడాదికాలంగా మూసివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా RTC అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరుగుదొడ్లు తెరిపించాలని కోరుతున్నారు.