హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరెంటు స్తంభానికి అల్లుకున్న తీగ

MDK: నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలోని దర్గా సమీపంలో ఇళ్ల మధ్య ఉన్న కరెంటు స్తంభానికి ఓ చెట్టు తీగలు దట్టంగా అల్లుకుని ప్రమాదకరంగా మారాయి. దీనివల్ల ఎప్పుడు ఏ విద్యుత్ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఆ తీగలను తొలగించి, ప్రమాదాన్ని నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.