హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

PLD: నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ఏఎం రెడ్డి కళాశాలలో ప్రారంభం కానుంది. 48 వార్డులకు జరిగిన పోలింగ్‌లో 70.02 శాతం ఓటింగ్ నమోదైందని కలెక్టర్ కృతిక శుక్ల తెలిపారు. కౌంటింగ్ కోసం 94 టేబుళ్లు, 174 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుందని పేర్కొన్నారు.