హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ డిపోలో రేపు 'డయల్ యువర్ డీఎం'

NGKL: నాగర్‌కర్నూల్ ఆర్టీసీ డిపో పరిధిలో సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు 'డయల్ యువర్ డీఎం' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. ప్రయాణికులు, వ్యాపారస్తులు తమ బస్సు సమస్యలు, సూచనలను నేరుగా తెలియజేసేందుకు 9959226288 నంబర్‌కు ఫోన్ చేయాలని ఆయన కోరారు. అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.