హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దుర్గామాత ఆలయంలో దొంగతనం'

PDPL: ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి కరీంనగర్ -మంచిర్యాల హైవే పక్కన గల దుర్గ మాత ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. తాళం పగలగొట్టి గర్భగుడిలోని అమ్మవారి వెండి హారాలు, ముక్కుపుడక, హుండీలోని డబ్బులు దోచుకుపోయారు. ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కొద్దికాలంగా ఆలయంలోని సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలుస్తోంది.