BHNG: ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష చారిత్రాత్మకమని, తెలంగాణ ఉద్యమంలో దీక్షా దివస్‌కు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా దీక్షా దివస్


