హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏటివాకిలిలో టీడీపీ అభ్యర్థి గెలుపు

CTR: పుంగనూరు మండలం ఏటివాకిలి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి మోపురి మోహన్ రెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి నందగోపాల్ రెడ్డిపై 86 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఫలితాలు వెలువడటంతో టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. విజయం సాధించిన మోహన్ రెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు.