హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ బీమా రెండో విడత రిజిస్ట్రేషన్ ప్రారంభం

MDK: మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు మున్సిపాలిటీలోని 5, 6, 7, 8 వార్డుల్లో ఇందిరమ్మ జీవిత బీమా పథకం రెండో విడత ప్రక్రియను ఛైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని కుటుంబానికి భరోసా కల్పించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.