హైదరాబాద్: 28°C
తెలంగాణ

కన్నెపల్లిలో పారిశుధ్య పనులు

ASF: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కన్నెపల్లిలో ఆదివారం పారిశుధ్య పనులు ముమ్మరంగా సాగాయి. సర్పంచ్ మోర్లె పార్వతి పర్యవేక్షణలో ప్రధాన తారురోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను బ్లేడ్ ట్రాక్టర్‌తో తొలగించారు. దుర్వాసన, దోమల బెడదపై గ్రామస్తుల ఫిర్యాదుతో అధికారులు స్పందించారు. చెత్తను రోడ్లపై వేయకుండా నిర్దేశిత ప్రాంతాల్లోనే వేయాలని సర్పంచ్ కోరారు.