హైదరాబాద్: 28°C
తెలంగాణ

జ్యోతిరావు పూలేకు ఘన నివాళులు

MDCL: బోడుప్పల్‌లో అంబేడ్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మైసయ్య ఆధ్వర్యంలో 406వ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు. జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మైసయ్య మాట్లాడుతూ.. కుల వ్యవస్థ, అంటరానితనం నిర్మూలనతో పాటు మహిళా విద్య, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని కొనియాడారు.