WGL: రాయపర్తి మండలం కాట్రపల్లిలో భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన భర్త యాకుబ్ పాషా ఆదివారం విద్యుత్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. మద్యానికి బానిసై భార్యను వేధించడంతోనే ఆమె పుట్టింటికి వెళ్లిందని బంధువులు, స్థానికులు తెలిపారు. గతంలోనూ ఇలాంటి ఘటనలకు పాల్పడ్డాడని గ్రామస్థులు పేర్కొన్నారు. పోలీసులు నచ్చజెప్పి అతడిని కిందకు దించారు.
తెలంగాణ
VIDEO: భార్య రావాలని విద్యుత్ టవర్ ఎక్కిన భర్త


