హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందాడని నిరసన

జనగామ పట్టణంలోని SSK ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే వజ్జ రాజు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆదివారం ఛాతి నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన రాజును పరీక్షల అనంతరం ఇంటికి పంపించారని, మరుసటి రోజు మళ్లీ అస్వస్థతకు గురికావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఆదివారం ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.