హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దీక్షా నియమాలు, క్రమశిక్షణ యువతకు ఆదర్శనీయం'

ADB: అయ్యప్ప దీక్షా నియమాలు, క్రమశిక్షణ యువతకు ఆదర్శమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని అశోక్ రోడ్డులో నిర్వహించిన అయ్యప్ప స్వామి ఆరట్టు మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆధ్యాత్మిక భావనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు.