హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడలో రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

NTR: ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించనున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు.