హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదలకు సీఎంఆర్ఎఫ్ ఆర్థిక భరోసా: ఎమ్మెల్యే

GDWL: CMRF పేదలకు ఎంతో ఆర్థిక భరోసా కల్పిస్తోందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 31వ వార్డుకు చెందిన జాష్ణవి వైద్య చికిత్స కోసం మంజూరైన రూ. 3 లక్షల LOC లేఖను ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఛైర్మన్ బండారి భాస్కర్, నరహరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.