హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్లోబల్ సమ్మిట్‌కు మెదక్ మున్సిపల్ కమిషనర్

MDK: రాష్ట్రంలో భారీ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వేదికగా 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026' ప్రతిష్ఠాత్మకంగా జరగనుంది. దేశ, విదేశీ ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరయ్యే ఈ కీలక సదస్సులో పాల్గొనే అరుదైన అవకాశం మెదక్ మున్సిపల్ కమిషనర్ నవీన్‌కు లభించింది. దీంతో ఆయన్ని పలువురు అభినందించారు.