హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో డయల్ యువర్ డీఎం

NRML: భైంసా ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భైంసా డిపో మేనేజర్ హరిప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహం 12 గంటల వరకు కొనసాగుతుందన్నారు. భైంసా పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు,బస్సు సర్వీసులు, మెరుగైన సేవలు, సలహాలు, సూచనల కోసం ప్రయాణికులు 9959226005 సెల్ ఫోన్ నంబర్ ను సంప్రదించాలని సూచించారు.