హైదరాబాద్: 28°C
తెలంగాణ

బెల్లంపల్లి మండల సమస్యల పరిష్కారంపై బీజేపీ నిరంతర పోరాటం

MNCL: బీజేపీ బెల్లంపల్లి మండల కార్యవర్గ సమావేశం ఈరోజు మండల అధ్యక్షులు గజెల్లి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బుధకుర్ద్ గ్రామంలో అత్యంత ఉత్సాహ భరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి మండల ఇంఛార్జ్ రామగౌని మహీదర్ గౌడ్ హాజరయ్యారు. బెల్లంపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలు, మౌలిక సదుపాయాల కొరతపై సుదీర్ఘంగా చర్చించారు.