హైదరాబాద్: 28°C
తెలంగాణ

దళితులను దూషించిన మనోజ్ రెడ్డిపై కేసు పెట్టాలి: CPI

HNK: దళితులను దూషించిన కట్టా మనోజ్ రెడ్డిపై కేసు పెట్టాలని CPI రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఆదివారం బాలసముద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, రెవెన్యూ అధికారుల అండతోనే ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామంలో కట్టా మనోజ్ రెడ్డి భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.