హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి తీగల చోరీ

NRML: లోకేశ్వరం మండలం రాజూరా ఎత్తిపోతల పథకానికి విద్యుత్ సరఫరా చేసే మూడు ట్రాన్స్‌ఫార్మర్లను దుండగులు ధ్వంసం చేసి అందులోని సుమారు రూ.10 లక్షల విలువైన రాగి తీగను చోరీ చేశారు. ట్రాన్స్‌ఫార్మర్లలోని 2 వేల లీటర్ల ఆయిల్ కూడా వృథా కాగా, ఎత్తిపోతల కమిటీ ఛైర్మన్ అనిల్ ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రదీప్, క్లూస్ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు.