హైదరాబాద్: 28°C
తెలంగాణ

వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే: మాజీ ఎంపీ

MHBD: జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన దీక్షా దివాస్ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోతు కవిత పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో అగ్రస్థానాన నిలిచిందని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రగతి కుంటుపడిందని విమర్శించారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.