హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్కతుర్తిలో మురుగుతో ప్రజల అవస్థలు

HNK: ఎల్కతుర్తి మండల కేంద్రంలోని 11, 12 వార్డుల్లో పారిశుద్ధ్యం పడకేసింది. ప్రధాన రహదారి పక్కన డ్రైనేజీలు నెలలుగా శుభ్రం కాక, కల్వర్టు పైపుల్లో చెత్త పేరుకుపోవడంతో మురుగు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. దోమల వ్యాప్తితో జ్వరాలు పెరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. అయ్యప్ప భక్తులకూ ఇబ్బంది కలుగుతోంది. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.