హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలందరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలి: MLA

ADB: ప్రజలందరూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని బోథ్ MLA అనిల్ జాదవ్ తెలియజేశారు. ఆదివారం తలమడుగు మండలంలోని కుచలాపూర్ గ్రామంలో నిర్వహించిన పోచమ్మ తల్లి సామూహిక బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాడి పంటలు సమృద్ధిగా పండి ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు అనిల్ జాదవ్ పేర్కొన్నారు.