హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి'

WNP: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పట్టణ ఎస్సై హరిప్రసాద్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి నక్క మహేష్ యాదవ్ పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా వనపర్తిలో విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మాదకద్రవ్యాల వాడకంతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కోరారు.