MLG: స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ కార్యక్రమంలో భాగంగా ఐఐఎం ఇండోర్ అధ్యయన బృందం ఆదివారం గోవిందరావుపేట మండలం గాంధీనగర్ గ్రామాన్ని సందర్శించింది. గ్రామంలోని ఇళ్లు, పాఠశాలలు, అంగన్వాడీలు, ఆరోగ్యకేంద్రాలు, దుకాణాల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాల పరిమాణం, స్వభావాన్ని పరిశీలించింది. తడి, పొడి, శానిటరీ, గృహ హానికర వ్యర్థాల వర్గీకరణ, సేకరణ, నిర్వహణపై వివరాలు సేకరించింది.
తెలంగాణ
వ్యర్థాల నిర్వహణపై ఇండోర్ బృందం అధ్యయనం


